Telangana

News March 17, 2024

రోడ్డు ప్రమాదంలో కేశవపట్నంవాసి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కేశవపట్నంకి చెందిన తిరుపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కేశవపట్నం నుంచి హుజురాబాద్ వెళ్తున్న టాటా ఏసీ ట్రాలీలో ప్రయాణిస్తున్న తిరుపతి, డ్రైవర్ గఫర్ హుజురాబాద్ మండలం సింగపూర్ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తిరుపతి అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

News March 17, 2024

ఎన్నికల షెడ్యూల్‌పై కలెక్టర్ ప్రత్యేక సమావేశం

image

లోకసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విధివిధానాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదివారం వెల్లడించనున్నట్లు డిపిఆర్ఓ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ హాజరుకావాలని సూచించారు.

News March 17, 2024

పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్ హరిచందన

image

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఈనెల18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని ఆమె పేర్కొన్నారు. 

News March 17, 2024

లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్ సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమైనందున ఎన్నికల ప్రక్రియలు కొనసాగిస్తారన్నారు. ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కలికంగా రద్దు చేస్తున్నామన్నారు. 

News March 17, 2024

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్: కలెక్టర్

image

జాతీయ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, యం.కృష్ణమూర్తి “జాతీయ లోక్ అదాలత్”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు రాజమార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

News March 17, 2024

ALERT ఆదిలాబాద్: అమల్లోకి ఎన్నికల కోడ్

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, వివిధ రకాల ప్రచార సామాగ్రిలు తొలగించాలని అన్నారు.

News March 17, 2024

సిద్దిపేట: ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT

News March 17, 2024

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్

image

నాగర్ కర్నూల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 1, 29, 021 ఓట్లు సాధించగా ఈసారి పక్కా గెలుస్తామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు.

News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం

image

రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. రైతులు సాగు చేసినా వరి పంటతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఎదురుగా కూడిన వడగళ్ల వర్షం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంతో పాటు రెడ్డి పేట, పోసానిపేట గ్రామాలలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

News March 16, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఏసీబీ వలలో జలమండలి అధికారులు
> ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. నగర వ్యాప్తంగా నిరసనలు
> ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
> లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష సమావేశం
> లాలాపేటలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీరు
> అమీన్‌పూర్ PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
> జీడిమెట్లలో 5 కేజీల గంజాయి స్వాధీనం
> హయత్‌నగర్-ఎల్బీనగర్ రూట్‌లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు