News March 17, 2024
ఎన్నికల షెడ్యూల్‌పై కలెక్టర్ ప్రత్యేక సమావేశం

లోకసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విధివిధానాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదివారం వెల్లడించనున్నట్లు డిపిఆర్ఓ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ హాజరుకావాలని సూచించారు.
Similar News
News April 18, 2026
ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు
News April 17, 2026
ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
News April 17, 2026
నిర్మాణ కార్మికుల కూలీ పెంపు: ఉప కార్మిక కమిషనర్

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్లను 10 శాతం పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చల్లో బిల్డర్లు, యూనియన్లు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం మేస్త్రీ కూలీ రూ.1,050, సహాయకుల కూలీ రూ.735 కు చేరింది. మే 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.


