India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట నిర్వహించాలంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి మే 31 వరకు అమలుచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వీటిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ తిరిగి పిల్లల ప్రీ స్కూల్ రీ-అడ్మిషన్, బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుంది.
పార్టీ మారిన వారికి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాకా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడని అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
పార్టీ మారిన వారికి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాకా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడని అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీకా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. MBNR జిల్లాలో 59 సెంటర్లలో 12,866 మంది విద్యార్థులు, వనపర్తిలో 6,969 మంది, నాగర్ కర్నూల్‌లో 59 కేంద్రాల్లో 10,526 మంది, గద్వాలలో 7203 మంది పరీక్షలు రాయనున్నారు.
పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. HYD జిల్లాలో 361 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 76,575 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} భద్రాచలం శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
∆} ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం
పదోతరగతి వార్షిక పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. ఉదయం9.30 నుంచి మధ్యాహ్నం12. 30 గంటల వరకు జరగనున్నాయి. 16,856 మంది హాజరుకానున్నారు. వీరి కోసం96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 97 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1, 983 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలను ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనునన్నాయి.
ధర్మారం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజ కలకలం రేపింది. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నడి రోడ్డుపై ఆకులపై పసుపు, కుంకుమ, నిమ్మకాయ, కోడి గుడ్డు పెట్టారు. ఇది చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ మండలం రాంనగర్ గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.
Sorry, no posts matched your criteria.