News March 18, 2024
ధర్మారం: క్షుద్ర పూజల కలకలం
ధర్మారం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజ కలకలం రేపింది. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నడి రోడ్డుపై ఆకులపై పసుపు, కుంకుమ, నిమ్మకాయ, కోడి గుడ్డు పెట్టారు. ఇది చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
Similar News
News December 1, 2024
పెద్దపల్లి: పాఠశాల భోజనాలను తరచుగా తనిఖీ చేయాలి: మంత్రి పొన్నం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మెస్ ఛార్జీల బిల్లులను గ్రీన్ చానల్స్ ద్వారా సరఫరా చేస్తామన్నారు.
News December 1, 2024
సీఎం పర్యటన నేపథ్యంలో పెద్దపల్లిలో పర్యటించిన మంత్రులు
డిసెంబర్ 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పెద్దపల్లికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని వెల్ఫేర్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్ఛంతో వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో MLAలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ ఉన్నారు.
News December 1, 2024
డిసెంబర్ 4వ తేదీన ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి: కలెక్టర్
ప్రజా పాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమం డిసెంబర్ 4వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని సి నారాయణ రెడ్డి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించినున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన మాట్లాడారు. జరగబోయే ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.