Telangana

News March 18, 2024

ఖమ్మం: ‘పది’ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

image

పదోతరగతి వార్షిక పరీక్షలు నేడు మొదలుకానున్నాయి. ఉదయం9.30 నుంచి మధ్యాహ్నం12. 30 గంటల వరకు జరగనున్నాయి. 16,856 మంది హాజరుకానున్నారు. వీరి కోసం96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 97 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1, 983 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్షలను ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనునన్నాయి.

News March 18, 2024

ధర్మారం: క్షుద్ర పూజల కలకలం

image

ధర్మారం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్షుద్ర పూజ కలకలం రేపింది. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో నడి రోడ్డుపై ఆకులపై పసుపు, కుంకుమ, నిమ్మకాయ, కోడి గుడ్డు పెట్టారు. ఇది చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

News March 18, 2024

ASF:’ ముచ్చటగా మూడోసారి ఆయనే’

image

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కాగజ్ నగర్ మండలం రాంనగర్ గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చేందుకు యావత్ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News March 18, 2024

NLG: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.

News March 18, 2024

MDK: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో 269 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 46,356 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

image

ఇవాళ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు.

News March 18, 2024

లోక్ సభ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ ప్రెస్ మీట్

image

లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 14 లక్షల 90 వేల 431 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు.

News March 18, 2024

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు: కలెక్టర్

image

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా చర్యలు చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించాలని, నగదు, మద్యం రవాణాను నియంత్రించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. కలెక్టర్‌, ఆదివారం పోలీసు కమిషనర్‌ సునీల్ దత్‌తో కలిసి ఇల్లందు రోడ్, ఎన్ఎస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ, ఎన్ని వాహనాలు తనిఖీ చేసింది అడిగి తెలుసుకున్నారు.

News March 18, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి రద్దు

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు తెలిపారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించనున్నారు. జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News March 18, 2024

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్..!

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్‌‌ టికెట్ బొంతు రామ్మోహన్‌‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌‌‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్..?