Telangana

News March 16, 2024

మోడీ సభ.. జగిత్యాల ఎస్పీ కీలక ప్రకటన!

image

ఈనెల 18న జగిత్యాలలో ప్రధాని బహిరంగ సభ సందర్భంగా పట్టణంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జిల్లా SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనికి ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వాహనాల అనుమతి లేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మధ్య నడిచే వాహనాలు ధరూర్ కెనాల్ బైపాస్ ద్వారా వెళ్లాలన్నారు. ధర్మపురి, కరీంనగర్ మధ్య నడిచే వాహనాలు పొలాస, తిమ్మాపూర్ బైపాస్ మీదుగా వెళ్లాలన్నరు .

News March 16, 2024

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

image

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ టికెట్ కోసం ముగ్గురు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సాంబయ్య, సీనియర్ నాయకులైన సింగాపురం ఇందిరా, జన్ను పరంజ్యోతి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. 2, 3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

News March 16, 2024

NGKL: భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ తన భార్య భారతిని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు భారతి 5 నెలల గర్భిణి. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2024

భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి: కాసోజు శంకరమ్మ

image

ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

News March 16, 2024

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల నగారా.. అనుమతులు తప్పనిసరి!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. నియోజకవర్గాల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 16, 2024

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18,12,858 మంది ఓటర్లు

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్‌లో సిద్దిపేటలో 2,36,474, మెదక్‌లో 2,16,748, నర్సాపూర్‌లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్‌చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వే‌ల్‌లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.

News March 16, 2024

కాంగ్రెస్ మెదక్ లోక్‌సభ అభ్యర్థికి తీవ్ర పోటీ..

image

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తి మీద సాము లాగా మారనుంది. మెదక్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా అతని భార్య నిర్మలను పోటీలో నిలపాలని అనుకుంటున్నారు. ఇదే స్థానంపై మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్ సైతం పోటీ చేయాలని చూస్తున్నారు. సీటు కోసం అధిష్ఠానం వద్ద గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

News March 16, 2024

HYD: స్థలం ఖాళీగా ఉందని కబ్జా చేశారు..!

image

రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్‌-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్‌ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.

News March 16, 2024

HYD: స్థలం ఖాళీగా ఉందని కబ్జా చేశారు..!

image

రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్‌-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్‌ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.

News March 16, 2024

ఆర్మూర్: మూడు ఇళ్లలో చోరీ

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయీముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. షబానా బేగం ఇంట్లో నుంచి రూ.80వేలు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.