India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామేపల్లి యువకుడు గ్రూప్–1,2,3,4 ఫలితాల్లో సత్తాచాటాడు. గోవింద్రాల బంజరకు చెందిన గంగారపు సత్యనారయణ – జ్యోతిర్మయి దంపతుల కుమారుడు రత్నేశ్వరనాయుడు ఇటీవల విడుదలైన గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో 277వ ర్యాంక్, జోనల్‌స్థాయిలో 120వ ర్యాంక్ సాధించారు. ఆయన ఖమ్మంలోని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేదు.
HCUలో ప్రభుత్వ దమనకాండ అంటూ KBR పార్కు దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది. HCU అడవిని నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు నినాదాలు చేశారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకృతి ప్రేమికులు, మద్దతు తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రాక్టర్ కొనివ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన బోధాసి సంతోష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ట్రాక్టర్ కొనివ్వమని అడగగా.. ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామన్నారు. దీంతో క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. మోస్రాలో 41.5℃, ఎడపల్లి 41.4, పెర్కిట్ 41.4, కోటగిరి 41.4, నిజామాబాద్ 41.3, గోపన్నపల్లి 41.3, వేంపల్లి 41.2, వైల్పూర్ 41.1, మెండోరా 41.1, ధర్పల్లి 41, మగ్గిడి 40.9, మోర్తాడ్ 40.8, రెంజల్ 40.7, ఇస్సాపల్లి 40.6, చిన్నమావంది 40.6, జక్రాన్‌పల్లి 40.6, కమ్మర్‌పల్లి 40.5, మదనపల్లి 40.5, సాలూర 40.3, భీమ్‌గల్ 40.3, కొండూరు 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.
NZBలో 14 నెలల బాలుడు కైలాస్ హత్య కేసును వన్‌టౌన్ పోలీసులు చేధించారు. మహారాష్ట్రకు చెందిన బోస్లే మాలాబాయి, ఆమె కొడుకు గోపాల్ హత్య చేసినట్లు వన్‌టౌన్ SHO రఘుపతి తెలిపారు. పోలీసుల వివరాలు.. కమలాబాయి అనే మహిళకు బిక్షాటన చేసే సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని.. అదే సమయంలో వీరికి తక్కువ డబ్బులు రావడంతో కక్షతో ఈ నెల 27న రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న బాలుడిని తీసుకెళ్లి బండి రాయితో కొట్టి హత్య చేశారు.
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ను సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు.
MBNR జిల్లాలో నిన్న బాలుడి కిడ్నాప్‌యత్నం కలకలం సృష్టించింది. స్థానికుల వివరాలు.. మిడ్జిల్ మం. వేములకి చెందిన రాజేందర్‌గౌడ్ కుమారుడు రుద్రాన్ష్ నిన్న రాత్రి ఒక్కసారిగా కనిపించకుండాపోయాడు. అదే గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి బాలుడితో వాడియాల స్టేజీ దగ్గర కనిపించినట్లు గ్రామస్థులు సమాచారమందించారు. అక్కడికెళ్లి రామస్వామిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.