Telangana

News March 18, 2024

కొమురవెల్లి బ్రహ్మోత్సవంలో ముగిసిన తొమ్మిదో వారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో తొమ్మిదో ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర కాగా పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాదాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకున్నాయి. 

News March 18, 2024

MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటర్లు 1,439

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది స్త్రీలు ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యంతరాల స్వీకరణ, మార్పుల తర్వాత ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News March 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్ @2111 పోలింగ్ కేంద్రాలు

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, మథోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్‌ ఓటర్లు ఉండగా 2,111 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News March 18, 2024

MDK: భార్యతో గొడవ.. ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మర్రి స్వామి(45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో అతడు అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుండే వాడని, అలాగే ఈనెల 11న భార్య జ్యోతితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈ క్రమంలో ఘనపూర్ గ్రామ శివారులో ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించారన్నారు. మృతదేహం కుళ్లిపోయిందన్నారు.

News March 18, 2024

HYD: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం

image

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.

HYDలో 4 రోజులు వర్షాలు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్‌నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్‌పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

కోరుట్ల: చేపలు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన చిన్నరాయుడు(30) ఆదివారం గ్రామ శివారులోని వాగు పరివాహక ప్రాంతంలో చేపలు పెట్టేందుకు వెళ్ళాడు. ఈక్రమంలో వ్యవసాయ మోటార్‌కు ఉన్న విద్యుత్ తీగను నీటి గుంతలో వేసి బండరాయిపై కూర్చుని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

News March 18, 2024

ADB: నిండు ప్రాణాన్ని బలిగొన్న చిన్నపాటి గొడవ

image

మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్‌కు చెందిన రాజు (30), సాగర్ ఓ వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం అక్కడే ఉన్న వినోద్, ప్రవీణ్‌లతో వారు గొడవపడ్డారు. దీంతో వినోద్, ప్రవీణ్ లు వారిని వెంబడించి టీటీడీ సమీపంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, సాగర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.