News March 18, 2024
MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటర్లు 1,439

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది స్త్రీలు ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యంతరాల స్వీకరణ, మార్పుల తర్వాత ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Similar News
News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
News February 11, 2025
మన్యంకొండకు ప్రత్యేక బస్సులు

ఈ నెల 12, 13వ తేదీల్లో మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని MBNR, NRPT డిపోల నుంచి తీసుకున్న 20 బస్సుల ద్వారా దాదాపు 150 అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. కొండ మీదికి 20 మినీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News February 10, 2025
MBNR: వైభవంగా మన్యంకొండ శ్రీనివాసుడి సూర్యప్రభ వాహన సేవ

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మాఘశుద్ధ త్రయోదశి సోమవారం రాత్రి స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అలమేలు, మంగ పద్మావతి అమ్మవార్లతో వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చాడు. పట్టు వస్త్రాలు, వజ్రకవచం అలంకరించి గోవింద నామ స్మరణ మధ్య సూర్యప్రభ వాహనంపై మెట్ల దారిలో ఊరేగించారు. ధర్మకర్తలు అళహరి మధుసూదనాచారి పాల్గొన్నారు.