India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న భూక్య హరిలాల్ నాయక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలో ఇదే పాఠశాలలో చదువుకొని, ఓనమాలు నేర్చిన పాఠశాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో మనబడి పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతలను, పూర్వ విద్యార్థులను ఆహ్వానిస్తూ బడి అభివృద్ధికి పాటుపడ్డారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రిలిమినరీ సర్వేలో భాగంగా పరిశీలించింది. అనంతరం వారు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏఎఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాష్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు .
విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం TGNPDCL ఆధునిక సేవలను ప్రారంభించింది. ఇకపై విద్యుత్ బిల్లులు, ఇతర ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 79016 28348ను సంప్రదించవచ్చు. ఈ నంబర్‌కు మెసేజ్ పంపి బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే ఫిర్యాదులు కూడా చేయవచ్చు. వాట్సాప్ సేవలతో పాటు www.tgnpdcl.com వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 118 పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్‌లోనే అప్లై చేయాలి. ఫీజు రూ.2000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. ఆసక్తిగల వారు ఈనెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.tgprg.in వెబ్ సైట్ చూడవచ్చు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కుటుంబ పెద్ద మరణించినట్లయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
KNRలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఇందులో భాగంగా మానకొండూరు చెరువును, చింతకుంట చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గణేష్ విగ్రహాల తరలింపు సమయంలో కరెంటు తీగలు, చెట్లు అడ్డు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు.
డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్ కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 15 వరకు ఉందని ఇగ్నో సీనియర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. నాంపల్లిలో ఇగ్నో స్టడీ సెంటర్ ఉందని, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలను 040-23117550, 9492451812 నంబర్లకు ఫోన్ చేసి తెలసుకోవచ్చన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీసీ ద్వారా భూభారతిపై సమీక్ష జరిపి మాట్లాడారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
వినాయక నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డూ రూ.కోటి పలికింది అని వినగానే ఆశ్చర్యపోతాం. గొప్పింటి వారికి వేలంలో నెగ్గడం ఈజీ. కానీ మిడిల్ క్లాస్లో ఐకమత్యం ఉంటే చాలని ఈ మిత్రులు నిరూపించారు. రాంనగర్ EFYA ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ లోకేష్, యోగేశ్వర్, కార్తీక్, డికాప్రియో కలిసి రూ.55 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఒక్కరితో కాదు.. నలుగురం కలిస్తే లడ్డూ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
MBNRలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని విధాలైన భద్రతా, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులు సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.