India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెక్నాలజీ సాయంతో ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న బంగారాన్ని పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎంజీ రోడ్ కు చెందిన సూరిబాబు పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాడు. తిరిగి ఆటోలో వెళుతున్న క్రమంలో 8 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. బాధితుడి మొబైల్ లోకేషన్ ఆధారంగా బ్యాగును గుర్తించారు.

మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.

మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.

తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు ఈరోజు నీటిని విడుదల చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లను నింపడానికి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్ఎస్పీ అధికారులకు ఎస్సీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు సమాచారం.

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు అయోమయంలో పడ్డారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి రాత్రంతా దుకాణాలతో వీధులు, ఫుట్ పాత్‌లో కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పగలు భారీగా ఎండ ఉండటంతో రాత్రి వేళల్లో రంజాన్ షాపింగ్ చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ ప్రాంతంలో రంజాన్ సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.!

జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థాయి BRS కార్యకర్తల సమావేశం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. మార్చి 31 తేదీ వరకు ఉన్న గడువును ఏలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
>>SHARE IT

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున:ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

నల్గొండ జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.