India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఫొటోలపై నిషేధం ఉండగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఫొటోలు తీసి వైరల్ చేయడంపై కేసు నమోదైంది. రాములవారిని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఓ వ్యక్తి తన ఫోన్లో ఫొటోలు తీశారు. అనంతరం వీటిని షేర్ చేశారు. రామాలయం వాట్సప్ గ్రూప్‌తో పాటు పలు గ్రూపుల్లో అవి షేర్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

నిజామాబాద్ నగరంలో ఒకటో టౌన్ పోలీసులు రూ.4.8 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం వీక్లీ మార్కెట్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శివప్రసాద్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఎలాంటి పత్రాలూ లేకుండా రూ.4.8 లక్షల నగదును తరలిస్తుండగా సీజ్ చేసినట్లు వన్‌టౌన్ SHO విజయబాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించేవారు నగదుకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బోథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇచ్చోడకు చెందిన పోనకంటి సుకుమార్ సాకెర గ్రామానికి దగ్గరి బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. తెల్లవారితే ఇంట్లో పెళ్లి అందరూ హాల్ది ఏర్పాట్లలో ఉన్నారు.సుకుమార్ పక్కనే ఉన్న సోనాల గ్రామానికి వెళ్ళాడు.గ్రామంలోని బస్టాండ్ పరిసరాలు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

మాజీ సీఎం కేసీఆర్ జనగామ పర్యటనలో భాగంగా భువనగిరి నుంచి అభివాదం చేసుకుంటూ బయలుదేరారు. మాజీ సీఎంకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి స్వాగతం పలికారు.

పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు అవి. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేనివి. కానీ ధరణి పోర్టల్‌లో ఆ భూముల రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూములుగా రికార్డులను మార్చేశారు.

మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. BRS నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, BJP పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈసారి కూడా గెలుపు మాదే అని BRS, తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ ధీమాలో ఉన్నాయి. మరి ఇక్కడ ‘పాగా’ వేసేది ఎవరో..? చూడాలి. దీనిపై మీ కామెంట్ ?

నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లయ్య (50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ముదిగొండ మండలం లోని గోకినపల్లి నుంచి నేలకొండపల్లి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ మీద నుంచి కింద పడిపోయారు. ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

దుమ్ముగూడెం సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధి దులేద్ – ముక్తాంజ్ గ్రామాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పికప్ వాహనానికి నిప్పు పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దులేద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన వాహనానికి నిప్పంటించిన ఘటనపై పోలీస్టేషన్లో కేసు నమోదైంది.

HYDలో ప్రస్తుతం 19,03,865 నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలో ఉండగా.. సుమారు 4 లక్షల మంది పన్ను చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్తులతో పాటు వందలాది ప్రభుత్వ ఆస్తులు కలిపి రూ.9,803.39 కోట్లు బకాయి పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్నుపై 5% వడ్డీ రాయితీతో ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.

ఇంటి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ ద్వారా చెల్లించే విధానం నేటితో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్చి 31 వరకు ఇంటి పన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ అవకాశం నేటితో ముగియనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.