India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతతో ఉన్నత విద్య అరకోరగా సాగుతోంది. ఇక్కడ 105 బోధనా సిబ్బంది పోస్టులు ఉండగా కేవలం 86 మంది ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న PU 16ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే పీహెచ్‌డీ పట్టా పొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్యాపకుల భర్తీపై దృష్టి సారిస్తేనే వర్సిటీ దశ మారే అవకాశం ఉంటుంది.

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

వనపర్తి మున్సిపాలిటికి చెందిన 8 మంది BRS కౌన్సిలర్లు శనివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్న 13వ వార్డు కౌన్సిలర్ మహేష్ కౌన్సిలర్లతో కలిసి MLA మేఘారెడ్డితో ఆదివారం భేటీ అయి చర్చిస్తున్నట్లు సమాచారం. మహేశ్‌కు ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు 8 మంది కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అణగారిన మైనార్టీల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ వివరించారు. ఈస్టర్ పండగ సందర్బంగా ఆదివారం రెమా చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాట్లాడారు. తమ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి అని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మైనార్టీలను అణచివేయాలని చేసే శక్తుల్ని తమ ప్రభుత్వం కూకటి వ్రేళ్ళతో పెకలిస్తోందన్నారు.

ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన రాము(25) కు సోనాపూర్ గ్రామానికి చెందిన రాంబాయితో వివాహం జరిగింది. రాము మద్యానికి బానిస కావడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. దీంతో మద్యానికి బానిసైన రాము ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా ఐనోల్లో 42.7, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.2, NGKL జిల్లా కిష్టంపల్లిలో 41.8, MBNR జిల్లా సల్కర్పేటలో 41.7, నారాయణపేట జిల్లా మరికల్లో 40.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్ మృతి చెందాడు. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన జి.కోటయ్య(55) నాలుగు నెలల క్రితం HYDకి వలస వచ్చారు. ఓల్డ్ అల్వాల్ పరిధి సూర్య నగర్‌లోని శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మూడో అంతస్తులో నిర్మించిన గోడలకు నీరు చల్లుతుండగా కాలు జారి రెండో అంతస్తులో పడి మృతి చెందాడు.

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.