Telangana

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు.. కీలక ఆదేశాలు జారీ !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
↪కేంద్రాల వద్ద టెంట్, తాగునీరు ఏర్పాటు చేయాలి
↪టార్పాలిన్లు,ఎలక్ట్రానిక్ కాంటా, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండాలి
↪ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఏపీఎంలు చర్యలు తీసుకోవాలి
↪ఎన్నికల కోడ్.. ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయరాదు.

News March 31, 2024

MBNR: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..!

image

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి ఈ ఎన్నికలో హోరాహోరీగా తలపడ్డారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగియగా.. విజయంపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న వెలువడే ఫలితాల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు.

News March 31, 2024

భద్రాచలం ఆలయంలో మూలవిరాట్ చిత్రాలు వైరల్

image

భద్రాచలం రాములవారి దేవస్థానంలో ఫొటోలపై నిషేధం ఉండగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఓ వ్యక్తి ఫొటోలు తీసి వైరల్ చేయడంపై కేసు నమోదైంది. రాములవారిని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఓ వ్యక్తి తన ఫోన్లో ఫొటోలు తీశారు. అనంతరం వీటిని షేర్ చేశారు. రామాలయం వాట్సప్ గ్రూప్‌తో పాటు పలు గ్రూపుల్లో అవి షేర్ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 31, 2024

NZB: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

image

నిజామాబాద్ నగరంలో ఒకటో టౌన్ పోలీసులు రూ.4.8 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం వీక్లీ మార్కెట్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శివప్రసాద్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఎలాంటి పత్రాలూ లేకుండా రూ.4.8 లక్షల నగదును తరలిస్తుండగా సీజ్ చేసినట్లు వన్‌టౌన్ SHO విజయబాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించేవారు నగదుకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.

News March 31, 2024

బోథ్: బంధువుల పెళ్లికి వెళ్లి… అనంత లోకాలకు

image

బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన బోథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇచ్చోడకు చెందిన పోనకంటి సుకుమార్ సాకెర గ్రామానికి దగ్గరి బంధువుల పెళ్ళికి వెళ్ళాడు. తెల్లవారితే ఇంట్లో పెళ్లి అందరూ హాల్ది ఏర్పాట్లలో ఉన్నారు.సుకుమార్ పక్కనే ఉన్న సోనాల గ్రామానికి వెళ్ళాడు.గ్రామంలోని బస్టాండ్ పరిసరాలు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News March 31, 2024

భువనగిరిలో కేసీఆర్ అభివాదం

image

మాజీ సీఎం కేసీఆర్ జనగామ పర్యటనలో భాగంగా భువనగిరి నుంచి అభివాదం చేసుకుంటూ బయలుదేరారు. మాజీ సీఎంకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి స్వాగతం పలికారు.

News March 31, 2024

సంగారెడ్డి: అసైన్డ్‌ భూములు.. పట్టాభూములుగా రికార్డుల్లో మార్పులు !

image

పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు అవి. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేనివి. కానీ ధరణి పోర్టల్‌లో ఆ భూముల రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చేశారు. కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా రికార్డులను మార్చేశారు.

News March 31, 2024

పాలమూరులో ‘పాగా’ వేసేది ఎవరో..?

image

మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. BRS నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, BJP పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈసారి కూడా గెలుపు మాదే అని BRS, తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ ధీమాలో ఉన్నాయి. మరి ఇక్కడ ‘పాగా’ వేసేది ఎవరో..? చూడాలి. దీనిపై మీ కామెంట్ ?

News March 31, 2024

ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లయ్య (50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ముదిగొండ మండలం లోని గోకినపల్లి నుంచి నేలకొండపల్లి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ మీద నుంచి కింద పడిపోయారు. ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.