Telangana

News March 18, 2024

ఎల్లారెడ్డిపేట: పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష 

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రవణ్ అనే విద్యార్థి పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష రాశాడు. తండ్రి రవి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన శ్రావణ్ 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు.

News March 18, 2024

పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు..!

image

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖరారు అయినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో డిప్యూటీ CM సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరిలో ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

News March 18, 2024

బోధన్ మాజీ ఎమ్మెల్యేకి షాక్

image

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో మరో షాక్ తగిలింది. జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 మార్చి 17న జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45లో యాక్సిడెంట్ జరగ్గా.. ఆ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News March 18, 2024

MBNR: పాలమూరులో విస్తరిస్తోంది !

image

పాలమూరు జిల్లాలో కుష్టువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి పట్టణాల్లోనే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు జిల్లాలో ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో స్పర్శలేని ఎర్రని రాగి రంగు, గోధుమ రంగు మచ్చలు పరిశీలించడం, కాళ్లు, చేతులు మొద్దుబారడం వాటిని పరిశీలిస్తారని, సిబ్బందికి సహకరించాలని ప్రజలకు DMHO కృష్ణ సూచించారు.

News March 18, 2024

అధికారం కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యం: నరేంద్ర మోదీ

image

తనకు అధికారం కాపాడుకోవడం కన్నా ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని, పసుపు ధరను భారీగా పెంచామన్నారు. దేశ ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.

News March 18, 2024

వరంగల్: ఓటరు నమోదుకు అవకాశం

image

లోకసభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక BLOలను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http:///ceotelangana.nic.in లేదా http:///voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’ 

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

image

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.

News March 18, 2024

MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్‌ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.