News March 18, 2024

MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్‌ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.

Similar News

News October 11, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం జీవీ గూడెం, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ, మునుగోడు నియోజకవర్గం కల్వకుంట్ల గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు.

News October 11, 2024

నల్లగొండ: ‘డీఎస్సీ- 2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి’

image

డీఎస్సీ-2024 లో ఎంపికైన అభ్యర్థులు 10,11 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు. డీఎస్సీ -2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేసే సమయంలో ఎల్బీ స్టేడియంలో అందించిన అపాయింట్ ఆర్డర్ జిరాక్స్ జత చేసి సంబంధిత కౌంటర్లు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు.

News October 11, 2024

NLG: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊరూరా సద్దుల బతుకమ్మ సందడి

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు పాటు మహిళలు తీరక్క పూలతో బతుకమ్మలు తయారుచేసి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలతో బతుకమ్మలు ఆడారు. చివరి రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా ఊరూరా బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు,కుంటలలో నిమజ్జనం చేశారు.