Telangana

News January 1, 2026

టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS : సీపీ

image

JAN 3 నుండి 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అటు సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News January 1, 2026

HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

image

HYD‌లో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్‌ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPL‌లో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

News January 1, 2026

RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, ⁠మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.

News January 1, 2026

MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31stన మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లతో పాటు ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. మొత్తం 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని వెల్లడించారు.

News January 1, 2026

MBNR: రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు ప్రారంభం

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) మధుసూదన్ నాయక్ 37వ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నినాదాలు, పోస్టర్లతో అలంకరించిన వాహనంను పచ్చ జెండా ఊపి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..రవాణా శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి నెలరోజుల పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.

News January 1, 2026

క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: SP

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. SP జానకి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. నూతన సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.

News January 1, 2026

మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

image

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News January 1, 2026

మెదక్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: అదనపు కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

News January 1, 2026

BREAKING.. RR: గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి రాము (20) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురునానక్ కాలేజీలో రాము బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 1, 2026

చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

image

వాట్సాప్‌ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.