Telangana

News January 1, 2026

అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

image

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.

News January 1, 2026

మహబూబ్‌నగర్ ఎస్పీకి ప్రమోషన్

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డి.జానకికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు నుంచే జిల్లా ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహిస్తారు.

News January 1, 2026

ఫ్యూచర్ సిటీ ముందున్న ‘కొత్త’ సవాళ్లు

image

కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ ముందున్న కొత్త సవాళ్లను న్యూ ఇయర్ సందర్భంగా ఓ లుక్కేద్దాం. ఈ ప్రాంతమంతా కొండలతో ఉంటుంది. ఇక్కడ డ్రోన్లూ, GPS పెద్దగా పనిచేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అకస్మాత్తుగా పరిధి మారడంతో అధికారుల మధ్య సంయవన లోపం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అన్నింటికంటే ప్రధాన సమస్య రోడ్లపై ముందుగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూరల్ ఏరియా కావడం ప్రజా రావాణాను ముందు మెరుగుపరచాలి.

News January 1, 2026

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 130 మంది పట్టివేత

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 130 మంది వాహనదారులు పట్టుబడ్డారని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ విభాగం పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

News January 1, 2026

HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

image

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.

News January 1, 2026

మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

image

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.

News January 1, 2026

భద్రకాళి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ.!

image

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కొత్త ఏడాదిని ప్రారంభించేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవబడే భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News January 1, 2026

వరంగల్: లక్ష్యసాధనకు పునరంకితం కావాలి: సీపీ

image

నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో ప్రారంభించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. 2026లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

News January 1, 2026

HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

image

రాజధానికి 4 కమిషనరేట్‌లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్‌ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్‌నగర్‌ను HYDలో కలపనుందట.