India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
HYDలో విషాదం నెలకొంది. కవాడిగూడలోని సీసీజీవో టవర్స్‌లోని 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 2న రక్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలులో అత్యాచారానికి గురైన బాలికకు(12) గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్‌ను అందించారు. కుటుంబ సభ్యులతో HYD వస్తున్న బాలిక.. అర్ధరాత్రి వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్ రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్‌కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.
శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6, 2025న ఉ.10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు వైన్స్‌లు బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీని పరిధిలోని కల్లు, వైన్ షాపులు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ కాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్ దీని పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని రాచకొండ పోలీసులు కోరారు.
శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగే శోభాయాత్రకు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూంలో అరగంట సేపు బంధించి వీడియోలు తీశాడు. లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
HYDలో క్యాబ్, ఆటోలో ప్రయాణించే యువతులు, మహిళలకు పోలీసులు కీలక సూచన చేశారు. ‘వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్ రూట్ మార్చితే వెంటనే ‘Hawk Eye’ యాప్‌లో SOS బటన్ నొక్కండి. దీంతో సన్నిహితులు, పెట్రోలింగ్ పోలీస్, సమీపంలోని PSకు రైడ్ వివరాలు వెళ్తాయి. వెంటనే మిమ్మల్ని సేవ్ చేస్తారు’ అని తెలిపారు. ఇటీవల పహాడీషరీఫ్‌లో యువతిపై కారు డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. బీ కేర్ ఫుల్ గర్ల్స్!
భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.
Sorry, no posts matched your criteria.