India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో SRH మ్యాచ్‌ను చూడటం ఆనందంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆ మ్యాచులో అభిషేక్‌శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఎంతో మందికి గుర్తుండిపోతుందన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు మేయర్‌తో పాటు కే.కేశవరావు వచ్చారు.
వర్షాలకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనతో ఉన్న GHMC వాతావరణ శాఖ, TGDPSలతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. వర్షాకాలంలో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు.
సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
ఈ శనివారం HYD వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్‌బండ్‌ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.
మేడ్చల్ బోడుప్పల్‌లో ఆస్తి కోసం అమానుషం జరిగింది. సవతితల్లి లలిత, మరిది రవి, స్నేహితుడు వీరన్నలతో కలిసి మహేశ్వరి (26)ని హత్య చేసింది. పెళ్లి కానుకగా తండ్రి ఇల్లు ఇవ్వబోతున్నారన్న అక్కసుతో DEC 7న చున్నీతో గొంతు బిగించి హత్య చేసి, మృతదేహాన్ని వంగమర్తి వద్ద మూసీలో పాతిపెట్టారు. ఈ నెల 2న తండ్రి ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కి తరలించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.