RangaReddy

News March 29, 2025

HYD: నగరంలో పెరిగిన ట్యాంకర్ల డిమాండ్

image

HYD నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉగాది, రంజాన్ పండుగలతో నీటి వినియోగం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు బాగా డిమాండ్ పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటలలోపు సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.

News March 29, 2025

రంగారెడ్డిలో అత్యధికం ఉష్టోగ్రత ఇక్కడే..!

image

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. యాచారం, మంగల్‌పల్లిలో 41.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. చందనవెల్లి 41.3, రెడ్డిపల్లె, చుక్కాపూర్ 41.2, ప్రొద్దుటూరు 41.1, నల్లవెల్లి, కేశంపేట 41, మీర్‌ఖాన్‌పేట, కొత్తూర్ 40.9, మామిడిపల్లె, పెదఅంబర్‌పేట్, తొమ్మిదిరేకుల 40.8, మొగల్గిద్ద, కాసులాబాద్ 40.7, కేతిరెడ్డిపల్లి 40.6, మొయినాబాద్ 40.5, తట్టిఅన్నారం, షాబాద్ 40.4, కోంగరకలాన్లో 40.3℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 29, 2025

కూకట్‌పల్లి: డబ్బులు విషయంలో ఒత్తిడి తట్టుకోలేక వ్యక్తి అదృశ్యం

image

ఇంటి నిర్మాణానికి సంబంధించి EMI కట్టాలంటూ అన్న వదిన వేధిస్తుండడంతో యువకుడు అదృశ్యమైన ఘటన KPHBలో చోటుచేసుకుంది. వంశీకృష్ణ (33), శాలిని దంపతులు కో లివింగ్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు. వంశీకృష్ణ సొంత ఊరిలో తన సోదరుడితో కలిసి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగగా EMI చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు.

News March 29, 2025

ఉగాదికి కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయం సిద్ధం 

image

ఉగాది పండగ సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సర్వం సిద్ధం ఐనట్లు ఆలయ EO లావణ్య తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక లైన్, ప్రసాద కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండగ పురస్కరించుకొని ఆదివారం సా 6లకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున భక్తులు పంచాంగ శ్రవణ ఫలితాన్ని విని తరించాలని కోరారు.

News March 29, 2025

HYD: నూతనంగా 13 ఎక్సైజ్ స్టేషన్‌లు

image

కల్తీ కల్లుతో పాటు మత్తు పదార్థాల వినియోగం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 13 స్టేషన్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మారేడ్‌పల్లి, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, మీర్‌పేట్, పెద్దఅంబర్‌పేట్, కొంపల్లి, కూకట్‌పల్లి, కాప్రా, నాచారం, అల్వాల్, అమీన్‌పూర్, బంజారాహిల్స్‌లలో ఏర్పాటు చేయనున్నారు.

News March 29, 2025

బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

image

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

News March 28, 2025

HYD: భవనం పైనుంచి దూకి వివాహిత సూసైడ్

image

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు..భోలక్‌పూర్‌కు చెందిన శబరీష్‌తో సౌజన్యకు గత నవంబర్ 13న వివాహమైంది. నిత్యం భర్త, అత్తమామలు గొడవ పడుతూ ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబీకులకు ఫోన్ చేసిన సౌజన్య.. గురువారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.

News March 28, 2025

HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

image

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.

News March 28, 2025

HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

image

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.