India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. AP వెస్ట్ గోదావరికి చెందిన మహిళ(29) కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్ షూట్‌లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నగరంలో ఈ రోజు రాత్రి సంబరాలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ఈవెంట్లకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. స్నేహితులతో కలిసి యువత సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది. బార్‌లు, పబ్‌లు, హోటళ్లు, ఫామ్ హౌస్‌లు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు సందడిగా మారనున్నాయి. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ(ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ(నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్, సప్లమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో CP సుధీర్ బాబు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 31 DEC రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్(ORR)లో లైట్ వాహనాలకు నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రంక్ & డ్రైవింగ్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.
గ్రేటర్ HYDలో ఓవైపు చలి పెరుగుతూ వస్తుంటే దానికి తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYDలో 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. దాదాపు 56 యూనిట్లకు పైగా రికార్డులు నమోదు కాగా.. విద్యుత్ కనెక్షన్లు పెరగడం, పరిశ్రమల వాడకం, ఉదయం పూట ఇళ్లలో గీజర్లు వినియోగించడం కారణాలుగా అధికారులు చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, HYD జిల్లాల పరిధిలో దాదాపుగా 24 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైనట్లు TGRAC తెలిపింది. 2014కు ముందు ఈ ఆక్రమణలు జరిగినట్లుగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 7 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించింది.
రాష్ట్రంలోనే అతిపెద్ద పూల మార్కెట్‌గా పేరొందిన గుడిమల్కాపూర్‌లో వ్యాపారులకు స్థలం సరిపోటం లేదని ఆవేవదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులూ ఇక్కడ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌కు సుమారు రూ.2.79 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి, మార్కెట్‌ను విస్తరించాలని కోరుతున్నారు.
న్యూఇయర్ వేడుకలకు భద్రతలో భాగంగా పోలీసులు నగరంలోని ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైక్‌లు, వాణిజ్య వాహనాలకు ఫ్లైఓవర్ల మీదకు అనుమతి ఉండదు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీదికి అనుమతి ఇస్తారు.
Sorry, no posts matched your criteria.