RangaReddy

News June 23, 2024

HYD: బోనాల బడ్జెట్‌ రూ.25 కోట్లకు పెంచాలని సీఎంకు వినతి

image

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను రూ.25 కోట్లకు పెంచాలని భాగ్యనగర్‌ మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్‌ గాజుల అంజయ్య కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో బోనాల బడ్జెట్‌ రూ.15 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.

News June 23, 2024

HYD: ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం: రాంచందర్‌

image

ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఛైర్మన్‌ చెరుకు రాంచందర్‌ అన్నారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. మాదిగ జాతిని, వారి ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.

News June 23, 2024

HYD: ఉత్సాహంగా ప్రారంభమైన షూటింగ్‌ పోటీలు

image

HYD గచ్చిబౌలిలోని సాట్స్‌ షూటింగ్‌ రేంజ్‌లో 10వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమిత్‌సంగి ప్రారంభించారు. ఈ పోటీల్లో 10ఎం రైఫిల్‌ ఓపెన్‌/సైట్‌ రైఫిల్‌, 25ఎం ఫిస్టల్‌, 50ఎం ఫిస్టల్‌, 10ఎం ఫిస్టల్‌ ఈవెంట్‌లలో 200 మందికి పైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

News June 23, 2024

HYD: చాలా భయపడ్డాను: రాజేశ్వరి

image

HYD మణికొండలోని చిత్రపురికాలనీలో రాజేశ్వరిపై <<13490170>>15 కుక్కలు దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు మాట్లాడుతూ.. ‘ఒక్కసారిగా నాపై అన్ని కుక్కలు దాడి చేశాయి.. చాలా భయపడ్డాను.. ప్రాణాలతో బయటపడుతానని అనుకోలేదు.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో వాటిని కొడుతూ రక్షించుకోగలిగాను. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాను. చేతిపై ఓ కుక్క కరిచింది. కింద పడడంతో గాయాలయ్యాయి. HYDలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది’ అని అన్నారు.

News June 22, 2024

హైదరాబాద్: వరద నివారణ చర్యలకు GHMC సిద్ధం

image

రానున్న రోజుల్లో భారీవర్షాలు ఉండొచ్చన్న వాతావరణశాఖ అంచనాలతో GHMC సన్నద్ధమైంది. రోడ్లపై నీరు నిలిచినప్పుడు, వరదను దారి మళ్లించే స్టాటిక్ బృందాలు, వరదనీటి సమస్యను పరిష్కరించే సంచార బృందాలు తాజాగా రంగంలోకి దిగాయని ఇంజినీరింగ్ విభాగం తెలిపింది. ముంపు నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించడమే ధ్యేయంగా ఇంజినీరింగ్ విభాగం 168 నీటిని తోడేమోటార్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు వెల్లడించారు.

News June 22, 2024

హైదరాబాద్‌లో‌ మరో దారుణహత్య

image

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లోనే మరో మర్డర్ జరిగింది. పాతబస్తీలోని నవాబ్‌సాహెబ్‌కుంట అచ్చిరెడ్డినగర్‌లో మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ దారుణ హత్య‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు‌, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. జాకీర్‌ హుస్సేన్‌‌ను బంధువులే హత్య చేసినట్లు‌ తెలుస్తోంది.

News June 22, 2024

కాంగ్రెస్‌లోకి BRS హైదరాబాద్ MLAలు?

image

గ్రేటర్‌‌లో BRS‌ను వీడేందుకు MLAలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. MP ఎన్నికల ముందు‌ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒక్కరిద్దరు BRS MLAలు మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్‌ ఓపెన్ ఆఫర్ చేయడం‌ గమనార్హం. ఇక పార్టీ మారే‌ MLAలు ఎవరనేది‌ తెలియాల్సి ఉంది.

News June 22, 2024

నిజాం నగలు.. హైదరాబాద్‌‌కు తేవాలని డిమాండ్!

image

నిజాం నగలను HYDకు తీసుకురావాలన్న‌ డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వజ్రాభరణాలను భద్రపరిచారు. 2001, 2006‌లో వీటిని నగరంలోనూ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తే‌ నగలు ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది లేదని గతంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో వీటిని‌ ప్రదర్శిస్తే బాగుంటుందని‌ నగరవాసులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News June 22, 2024

HYD: జులై 6వ తేదీ నుంచి సీపీజీఈటీ పరీక్షలు

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో అన్ని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2024 పరీక్షలను జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి HYDలో తెలిపారు. ఈ పరీక్షలను రోజూ మూడు సెక్షన్లలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను జులై మూడో తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. SHARE IT

News June 22, 2024

HYD: అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

image

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి పనులు సాధ్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ రోజు HYD పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌లో రూ.8.40 కోట్లతో నూతనంగా నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం, ఆడిటోరియంను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.