India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా ఆసుపత్రికి త్వరలో నూతన భవనం నిర్మిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం ఆయన ఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉస్మానియా ఆస్పత్రి అంటే షాన్ అని ఆయన గుర్తు చేశారు. వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
HYDకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతబస్తీ భవానీ నగర్ PS పరిధిలోని తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని కర్ణాటక పోలీసులు HYDలోని కుటుంబ సభ్యులకు అందించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాత్ రూమ్‌లో యువతి స్నానం చేస్తుండగా దొంగ చాటుగా వీడియో తీసిన వ్యక్తిని HYD కాచిగూడ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్ లంక లైన్‌లో నివాసం ఉంటున్న యువతి(25) తన ఇంట్లో బాత్ రూమ్‌లో స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన జెల్‌ఫేస్ (24) దొంగ చాటుగా వీడియో తీస్తుండగా ఆమె గమనించింది. అతడితో గొడవపడి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
CM రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచే మాదిగలకు మోసం చేస్తుందని, 80 లక్షల జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. శుక్రవారం ఆయన HYD గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు యూపీఏ హయాంలోనే పర్మిషన్లు వచ్చాయన్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే, గడిచిన పదేళ్లలో దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు.
BRS పార్టీ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ MLA, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు BRS నాయకుడు, కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద ఈరోజు కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చిన దానం నాగేందర్ రాజకీయ చాప్టర్ ఖతమైందని మండిపడ్డారు. MLA అంటే అధికారంలో ఉండడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నా MLAనే అంటారని, దీనిని దానం గ్రహించాలన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలు బదిలీలు అయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తాజాగా జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే 27 మంది ఎస్ఐలు బదిలీలు అయ్యారు. చాలా రోజుల నుంచి ఒకే ఏరియాలో ఉన్న పోలీసులతోపాటు ఎన్నికల సమయంలో బదిలీలు అయిన ప్రాంతాల్లో ప్రస్తుతం బదిలీలు చేశామని చెప్పారు.
పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సరూర్‌నగర్ PS పరిధి హుడానగర్‌లో ఉండే M.లక్ష్మణ్ 2018లో ప్రేమ పేరుతో బాలికను మభ్యపెట్టి అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. లక్ష్మణ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష, రూ.8వేల జరిమానాను నేడు కోర్టు విధించింది. అలాగే రూ.2లక్షలు నష్టపరిహారం బాధితురాలికి అందించాలని పేర్కొంది.
HYD, RR, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో 22 ప్రభుత్వ కాలేజీల్లో గతేడాది 8 వేల మందికిపైగా విద్యార్థులు చేరగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే 6వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య వేగంగా పెరుగుతోందని హైదరాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు.
Sorry, no posts matched your criteria.