India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ స్పెషల్ బ్రాంచ్ సీసీఆర్పీ సహా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని మరో చోటుకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 204 మంది హెడ్ కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేశారు.
ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన బోధన సాధ్యమవుతుంది. HYD, RR, మేడ్చల్ జిల్లాలోని 49 జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. నిధుల కొరతతో ఈ విద్యా సంవత్సరంలో నియమించలేదు. ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి ఉంటే కొంతైనా పరిష్కారం లభించేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
ఓ బంగారు ఆభరణాల యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి యత్నించిన విషయ తెలిసిందే. DCP కోటిరెడ్డి, CI సత్యనారయణ ప్రకారం.. మేడ్చల్‌లోని శ్రీ జగదాంబ జువెలర్స్‌లోకి బురఖా వేసుకొని ఒకరు, హెల్మెట్‌తో మరొకరు వచ్చారు. యజమాని ఛాతిలో కత్తితో పొడవగా.. పక్కనే ఉన్న అతడి కొడుకు ఇంట్లోకి పారిపోయాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని బెదిరించగా వారిని నెట్టేసి బయటకు పరిగెత్తి చోర్ అని అరవడంతో దుండగులు పారిపోయారు.
HYD బహదూర్‌పురా నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ తరలింపు అవాస్తవం అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ విషయమై PCCF వైల్డ్ లైఫ్ వార్డెన్ మోహన్ పర్గెయిన్(తెలంగాణ మెంబర్) క్లారిటీ ఇచ్చారు. షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవం అని పేర్కొన్నారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా లేదని వివరణ ఇచ్చారు. కాగా, జూ పార్కుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. SHARE IT
✓HYD: నగరంలో జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల జాతర
✓HYD నగరంలో ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంపీలకు ఘన స్వాగతం
✓ప్రజా ఆరోగ్యమే పరమావధిగా పని చేస్తాం: రాజనర్సింహ
✓కాచిగూడలో మృతదేహం కలకలం
✓హైదరాబాద్ బోనాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
✓RR: డ్రం సీడర్ యంత్రంతో వరి పంట విత్తటం సులువు
✓రాష్ట్రంలో అత్యల్ప సిజేరియన్లు మేడ్చల్‌లోనే..!
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న BJP స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు ఎయిర్‌పోర్టుకు వచ్చిన బండి సంజయ్‌కి పండితులు ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన కీలక నేతలు కేంద్రమంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సెల్యూట్ యాత్ర ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గోల్కొండ, సికింద్రాబాద్, లాల్‌దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు భాగ్యనగరంలో భోనాలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యల్పంగా సి-సెక్షన్స్ సిజేరియన్లు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. 51 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెల రిపోర్ట్ విడుదల చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వికారాబాద్ జిల్లాలో ఏకంగా 86% కడుపు కోతలు జరిగాయని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 12 జిల్లా కన్జ్యూమర్ కమిషన్లు ఉండగా అందులో ప్రతినెలా 250కి పైగా కేసులు నమోదవుతుంటాయి. రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 100 కేసులు నమోదువుతున్నాయి. 50కి పైగా కేసుల నమోదుతో రెండో స్థానంలో హైదరాబాద్-1 కమిషన్ ఉంది. రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో అధిక కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో అదనపు కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరారు.
దేశ వ్యాప్తంగా మొక్కజొన్నల సాగు పెరగాలని, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. RR జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జాతీయ మొక్కజొన్న పరిశోధనల మండలి డైరెక్టర్ హెచ్ఎస్ జాట్, అంతర్జాతీయంగా మొక్క జొన్నలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మొక్కజొన్న పంట పండించడం ద్వారా రైతులు సైతం మంచి లాభాలు పొందుతారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.