India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శామీర్‌పేట్ మండలం హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్య,యువజన క్రీడా అధికారి తెలిపారు. 3విడతలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నామన్నారు. అందులో సెలెక్ట్ అయిన వారికి అడ్మిషన్లు ఇస్తామన్నారు. వయసు, విద్యార్హత, పుట్టిన తేదీ, ఆధార్, కుల ధ్రువపత్రాలు, 3వ తరగతి గ్రేస్ రిపోర్ట్ ప్రతులు, 5పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు.
HYDలో వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు కొన్నేళ్లుగా తీరడం లేదు. వేసవిలో పనులు ప్రారంభించినా.. సమస్య తీరే దిశగా పనులు సాగటం లేదు. రోడ్లపై నీరు నిలవడం, గల్లీలు మునిగిపోవడం, బైకులు కొట్టుకుపోవడం, ఇళ్లలోకి వరద నీరు, డ్రైనేజీ పొంగిపొర్లడం, ప్రమాదకరంగా మ్యాన్ హోల్, స్తంభాల ఏర్పాటు వంటి ఎన్నో సమస్యలు ఏళ్లు గడుస్తున్నా తీరటం లేదని సాటి హైదరాబాదీలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
యువకుడు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంగడపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు ఠాను(20) డిగ్రీ చదువుతున్నాడు. 18న డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. అనంతరం ‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. మళ్లీ సంవత్సరం తర్వాత వస్తా’ అంటూ లెటర్ రాసి తన బైక్ తీసుకొని వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశారు.
HYD కాచిగూడలో రైలు పట్టాల వద్ద ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాలు.. రైలు పట్టాల వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం ఉందని సిబ్బంది రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి, పాతబస్తీకి చెందిన కిజార్(22)గా అతడిని గుర్తించారు. కాగా ఇది హత్యనా.. ఆత్మహత్యనా.. రైలు ఢీకొని చనిపోయాడా.. అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు.
HYDలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బీన్స్ ధర ఆకాశానంటాయి. తాజాగా హైదరాబాద్ మెహిదీపట్నం రైతుబజార్‌లో కిలో బీన్స్ ధర రూ.175గా నిర్ణయించారు. నిన్న కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కిలో బీన్స్ రూ.300 కంటే ఎక్కువగా పలుకుతోంది. దీంతో కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయి. కాగా లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలను అరికట్టాలని, పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించి, నిఘా పెంచాలని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హోంమినిస్టర్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. సమతా ఆధ్యాత్మికమూర్తి అన్నమయ్య జయంతి సందర్భంగా ‘అన్నమయ్య కళాక్షేత్రం’, ‘హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని బిర్లాసైన్స్ సెంటర్‌లో ‘ద్వేషం, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూమతం’ నినాదంతో సమ్మేళనం నిర్వహించారు.
రాష్ట్రంలో చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జులై ఏడో తేదీన పోరుయాత్ర చేపట్టబోతున్నామని, అదే నెల 15న కమిషనరేట్‌ను ముట్టడిస్తామని మాజీ MLC చెరుపల్లి సీతారాములు ప్రకటించారు. HYDలో తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్, చేనేత కార్మికుల సంఘం సంయుక్త సమావేశం జరిగింది. ఉపాధి దొరక్క, వస్త్రపరిశ్రమై ఆధారపడ్డ చేనేత, పవర్‌లూమ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. HYD విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలన్నారు. కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వచ్చేసారి ప్రధాని అవ్వడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడని కొనియాడారు. విద్యావంతుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి అని అన్నారు. భారత్ జోడో యాత్రతో తన సత్తా ఏంటో దేశానికి చూపించారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.