India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటిలాగే నేడు మిర్చి ధరలు తటస్థంగా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.15,000 ధర పలకగా.. నేడు కూడా రూ.15వేల ధర పలికింది. అలాగే, 341 రకం మిర్చి క్వింటాకు నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.14,500 పలికింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి నిన్న రూ.13,500 ధర రాగా ఈరోజు కూడా అదే ధర వచ్చింది.
వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కులగణన సర్వేపై అధికారులతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను సర్వే గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహబూబాబాద్ పట్టణానికి రానున్నారు. BRS ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. మౌలాలి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఉమ్మడి WGL జిల్లాలోని JN, KZJ, WL, MHBD, DRKL స్టేషన్లలో ఆగుతూ కొల్లం స్టేషన్ వరకు వెళ్లనుంది. కొల్లం వైపు వెళ్లే రైలు(07143) ఈనెల 22, 29, వచ్చే నెల 6, 13, 20, 27 తేదీల్లో నడవనుంది. అలాగే కొల్లం నుంచి వచ్చే ట్రైన్(07144) ఈనెల 24, వచ్చే నెల 1, 8, 15, 22, 29న నడవనుంది.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పర్యటన భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సురేఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం మంత్రులకు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, వేములవాడలో అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు నేడు రైతులకు స్వల్ప ఊరట నిచ్చాయి. సోమవారం రూ.6,750 పలికిన క్వింటా కొత్త పత్తి ధర.. మంగళవారం రూ.6,730కి చేరింది. ఈ క్రమంలో నేడు రూ.6,810 పలకడంతో అన్నదాతలకు స్వల్ప ఊరట లభించినట్లు అయింది. అయితే సిసిఐ నిర్దేశించిన ధరకు కొనుగోలు జరగడం లేదని రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జనగామ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14656765>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. బచ్చనపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కరుణాకర్, సాయిబాబా రైతులు. అయితే వారి ట్రాక్టర్లకు సామగ్రి తీసుకురావడానికి చేర్యాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. కాగా, బైకు నుజ్జునుజ్జయింది.
గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ పట్టణానికి, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మహర్దశ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎయిర్ పోర్ట్, టెక్స్టైల్ పార్క్తో పాటు వరంగల్ పట్టణాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందు నిలబెట్టడం కోసం మన ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనుందని చెప్పారు.
ఓరుగల్లు చరిత్రలో మరుపురాని రోజుగా ఈరోజు నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. వరంగల్ పట్టణాన్ని మహా నగరంగా మార్చడానికి దాదాపుగా రూ.6 వేల కోట్ల నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళల ఎదుగుదలకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహిళా సంఘాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయమని ట్వీట్ చేశారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మంత్రి సురేఖ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కాసేపు సమావేశంలో చర్చించారు.
Sorry, no posts matched your criteria.