India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 11న వరంగల్ నగరంలోని సికే నాయుడు కన్వెన్షన్ హల్లో జరిగే జాబ్ మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈనెల 11న ఉదయం 9:30 గంటల నుంచి జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై నిర్వాహకులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించి సమర్ధవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
వరంగల్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. వరంగల్ జిల్లాలోకి ఇప్పుడు తీవ్రమైన తుఫాను కదులుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో తీవ్రమైన తుఫానులు, గాలులు విస్తరించబోతున్నాయని పేర్కొన్నారు. కాగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. వయో వృద్ధులు, వికలాంగులకు సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద దేవి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల నుంచి 93 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సమస్యలపై 41, మిగతా శాఖల నుంచి 52 వచ్చాయి. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 2024-25 సంవత్సరానికి 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. సోమవారం శివనగర్‌లో ఓ రేషన్ షాపు వద్ద నరేంద్ర మోదీ ఫొటో పెట్టి మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలు ఇస్తుంటే.. మొత్తం తామే ఇస్తున్నట్టు కాంగ్రెస్ గప్పాలు కొడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.