Warangal

News March 13, 2026

బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పులకు తావులేకుండా పారదర్శకమైన డేటాను సేకరించాలని సూచించారు.

News March 13, 2026

గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు: కలెక్టర్

image

గ్యాస్ సిలిండర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు, ఆశ్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

News March 12, 2026

వరంగల్: ప్రజా పాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన: కలెక్టర్

image

ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాఖల వారీగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించాలని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత పెంచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 11, 2026

WGL: ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ ఆలస్యం..!

image

WGL నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ అంశం వివాదంగా మారింది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా వాటిలో 40కిపైగా లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు DMHO కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ అనుమతి అవసరం కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని, తద్వారా CMRF, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు.

News March 9, 2026

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

image

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

News March 9, 2026

వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News March 9, 2026

వరంగల్: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లోని వేర్‌హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ఆదివారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News March 8, 2026

గంగాదేవిపల్లిలో విషాదం.. మాజీ సర్పంచ్ మృతి

image

గీసుకొండ మండలం గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి (65) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మూడు పర్యాయాలు సర్పంచ్‌గా, ఊకల్ సొసైటీ చైర్మన్‌గా సేవలందించిన ఆయన, గంగాదేవిపల్లిని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిపారు. మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌కు సన్నిహితుడైన రాజమౌళి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం జిల్లా రాజకీయాలకు తీరని లోటని కొనియాడారు.

News March 8, 2026

వరంగల్: పదో తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

image

వరంగల్ జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 47 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, ఆరుగురు రూట్ అధికారులు, ఆరుగురు అదనపు రూట్ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 496 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల్లో 22 శాశ్వత, మిగిలిన 25 కేంద్రాల్లో తాత్కాలిక CC కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.