India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.
కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృశ్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.
గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.
వరంగల్ షీటీం పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు షీ టీం పని తీరుపై ఈరోజు అవగాహన కల్పించారు. షీ టీంను ఎలా సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలో వారు విద్యార్థినిలకు వివరించారు. అలాగే సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, మహిళా వేధింపులు, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్, డయల్ 100 మొదలైన అంశాలను ప్రజలకు వివరించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యాపారులకు, రైతులకు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సరుకుల బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిర్చి బీటు ఉ.7.05 ని.కు, పత్తి బీటు 8:05 ని.కు, పల్లికాయ ఉ.8:15 ని.కు, పసుపు బీటు 8:30కి, అపరాలు, ధాన్యం బీటు 8:45 ని.కు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 28 సోమవారం నుంచి 11-06-2025 బుధవారం వరకు ఈ బీటులో మార్పులుంటాయన్నారు.
✓వరంగల్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు
✓WGL: క్వింటా పత్తి ధర రూ.7,700
✓సంగెం మండలంలో పర్యటించిన పరకాల MLA రేవూరి
✓భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC కవిత
✓నల్లబెల్లి: గొర్రెలు, మేకలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
✓11వ రోజుకు చేరిన తూర్పు జర్నలిస్టుల దీక్ష
✓WRPT: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన MLA నాగరాజు
✓ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని పలుచోట్ల ర్యాలీలు
పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై మెడికల్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి, డైరక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు.
HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్‌పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్‌లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.