India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పురుగు మందు డబ్బాలతో మాజీ సర్పంచ్ దంపతులు ధర్నాకు దిగారు. రూ. 20 లక్షలు అప్పు తెచ్చి గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించగా, ఇంతవరకు బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయమంటే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గునుగంటి శ్రీజ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో శ్రీజ ప్రతిభ కనబరిచింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. ప్రధానోపాధ్యాయురాలు జయ, ఉపాధ్యాయులు శ్రీజను అభినందించారు.
చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ZPHS 9వ తరగతి విద్యార్థి భూర వినయ్ కుమార్ ఈరోజు హైదరాబాదులోని SCERTలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో మొదటి స్థానం కైవసం చేసుకొన్నాడు. నవంబర్ 26న ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌లో జరిగే జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికయ్యాడని వరంగల్ DEO మామిడి జ్ఞానేశ్వర్, WGL జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్‌లు వస్తున్నాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డీ.విజయ భాను తెలిపారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సెమీడీలక్స్ మొత్తం 82 బస్‌లు వస్తున్నాయన్నారు. వీటిని హనుమకొండ నుంచి HYD, నిజామాబాద్, KNR, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం రూట్లలో నడుపనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. వచ్చే నెలలో నడుస్తాయన్నారు.
వరంగల్ ట్రాఫిక్ PS పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ నలుగురు వాహనదారులకు మంగళవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 28 మందికి రూ.36,100 జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కే.రామకృష్ణ తెలిపారు.
బీసీ కమిషనర్ పర్యటనలో భాగంగా నవంబర్ 2న హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీలంతా పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో బీసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక స్థితిగతులు రాజకీయ పార్టీలకతీతంగా బీసీ సంఘాలు పాల్గొని వినతిపత్రం అందించాలని కోరారు.
గోవాలో గవర్నర్ శ్రీధరన్ పిళ్లైని జాతీయ ST కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ కలిశారు. విద్యారంగంలో గిరిజన, ఆదివాసీ తెగలు విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆదివాసి తెగలు, గిరిజన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని గవర్నర్‌ను కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.5,950 ధర రాగా.. నేడు రూ.4,600 ధర పలికింది. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేలు ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటాకు సోమవారం రూ.10,859 ధర రాగా.. నేడు రూ.10,939 ధర వచ్చింది. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,550 ధర పలికిందని అధికారులు తెలిపారు.
మహబూబాబాద్ పట్టణ ప్రజలకు టౌన్ సీఐ దేవేందర్ పలు సూచనలు చేశారు. దీపావళి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రజలు పలు సూచనలు పాటించాలన్నారు. కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్, పోలీస్ అధికారులకు తెలపాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. తేజ మిర్చి క్వింటాకు సోమవారం రూ.17,000 ధర రాగా.. నేడు కూడా అదే ధర వచ్చింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా.. నేడు రూ.1,000 పెరిగి, రూ.15,000 అయింది. మరోవైపు 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.14 వేల ధర రాగా.. ఈరోజు రూ.15 వేలకు చేరిందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.