India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఐదు మైనారిటీ గురుకులాల్లో (ఆంగ్ల మాధ్యమం) 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ) కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లాలో ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలల్లో ఓటు ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు.

జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

వరంగల్ జిల్లాలోని దివ్యాంగులకు వివిధ సహాయ ఉపకరణాల మంజూరుకు అర్హత కలిగిన వారు ఈనెల 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి.రాజమణి తెలిపారు. అర్హత గల వారికి బ్యాటరీ వీల్ ఛైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు (డిగ్రీ విద్యార్థులకు), ట్యాబులు మంజూరు చేసి అందిస్తామన్నారు.

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని పక్కాగా అమలు చేసి, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొని మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.

వరంగల్ జిల్లాలోని ప్రజావాణి వినతులకు అధికారులు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆమె బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపాలిటీలు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలు చీరలను పంపిణీ చేయడానికి గాను సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడక ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని నేతలు భావిస్తున్నారు.

వరంగల్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇప్పటికి 48 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.380.53 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 6,810 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.
Sorry, no posts matched your criteria.