Warangal

News January 12, 2026

ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 12, 2026

వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.

News January 12, 2026

ప్రజావాణి వినతులు పరిష్కార దిశగా అడుగులు: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్‌కు సమర్పించారు. మొత్తం 129 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 52, ఇతర శాఖలకు సంబంధించినవి 77 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News January 12, 2026

ఇంటర్ పరీక్షలు సమన్వయంతో నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు.ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ రాబోయే పరీక్షల వివరాలను కలెక్టర్‌కి వివరించారు.

News January 10, 2026

వరంగల్ చౌరస్తాలో దారి తప్పిన బాలుడు

image

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. పేరు అడగగా తన పేరు ‘రేయాన్’ అని మాత్రమే చెప్పాడు. చిరునామా, కుటుంబ వివరాలు చెప్పలేకపోయాడని పోలీసులు చెప్పారు. బాలుడిని గుర్తించిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని లేదా ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

News January 10, 2026

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2026

వరంగల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. వంట సిబ్బంది తొలగింపు

image

వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ డా.సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట చేసే సిబ్బంది విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, ముగ్గురు వంట సిబ్బందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 9, 2026

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా

image

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా 13-01-2026న ఐటిఐ క్యాంపస్లో నిర్వహించనున్నారు.
ఈ మేళాలో IndusInd Nippon Life Insurance Co. LTD, శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ సంస్థలు పాల్గొననున్నాయి. IndusInd Nippon Life Insurance సంస్థలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు 25 ఖాళీలు ఉన్నాయన్నారు.

News January 9, 2026

మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

image

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2026

వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

image

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు