Warangal

News January 9, 2026

వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.

News January 8, 2026

వరంగల్: పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో 31 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.మహేశ్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు, కోశాధికారిగా డి.ప్రణయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.

News January 8, 2026

WGL: సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్లు!

image

జిల్లాలో సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్ల మేర ఉన్నాయి. 15,311 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయగా, మరో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఎస్పీ కింద రూ.346.3 కోట్లను రైతులకు చెల్లించగా, మరో రూ.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. సన్న వడ్ల బోనస్ కింద రూ.75.2 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.21.2 కోట్లను మాత్రము ప్రభుత్వం చెల్లించింది.

News January 7, 2026

జూనియర్ కాలేజీలకు డిజిటల్ టీవీలు: వరంగల్ DIEO

image

వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి అందించినట్లు వెల్లడించారు. నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా విలువైన డిజిటల్ సామాగ్రి పంపిణీ చేశారన్నారు.

News January 7, 2026

WGL మార్కెట్లో చిరుధాన్యాల ధరల్లో స్వల్ప తేడాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కి బుధవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,850 ధర రాగా..ఈరోజు రూ.8,700కి తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయకి మంగళవారం రూ.5,500 ధర వస్తే.. నేడు రూ.5,970 అయింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,080 పలికితే.. నేడు రూ.2,060 పలికింది. దీపిక రకం మిర్చికి మంగళవారం రూ. 16,500 ధర ఉంటే..ఈరోజు రూ.17,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.

News January 7, 2026

జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

image

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.

News January 6, 2026

ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలించాలి: కలెక్టర్

image

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు నిర్ణీత గడువులోగా తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణాల పరిధిలో జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పార్టీల ప్రతినిధులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులపై స్పందించాలన్నారు.

News January 6, 2026

పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

image

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.

News January 6, 2026

వరంగల్: రెన్యువల్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ జాప్యం!

image

వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి అనుమతుల పునరుద్ధరణ(రెన్యువల్) చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 180కి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా అందులో సగానికి పైగా రెన్యువల్ కాలేదు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సీఎం సహాయ నిధి పథకం కింద వైద్యం అందించలేకపోతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు.

News January 6, 2026

వరంగల్: జిల్లా స్థాయి యువజనోత్సవాలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 6న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించాల్సిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యువ జనోత్సవాలను వాయిదా వేసినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.