India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి పి.భాగ్యలక్ష్మీ తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో గడువులోపు దరఖాస్తు చేయాలని ఆమె కోరారు.

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి రైలు పట్టాలపై దేశాయిపేట ప్రాంతానికి చెందిన మంద వినోద్ అన్న యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా మిల్స్ కాలనీ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, రాధిక అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా యువకుడు పట్టాలపై పడుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59 దరఖాస్తులు కాగా, జీడబ్ల్యూఎంసీ (GWMC)కు 20, డీఆర్‌డీఓ, డీపీఓ శాఖలకు చెరో 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 50 ఉన్నట్లు వెల్లడించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

రాయపర్తి మండలం కొండాపురంలో రైతు కొండ వీరస్వామి (60) తన వ్యవసాయ క్షేత్రం వద్ద అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో పడి ఉన్న వీరస్వామి మృతదేహాన్ని గొర్రెలు కాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

వరంగల్ నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా వరంగల్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. Safety First, Life First నినాదంతో రాంగ్ రూటులో వాహనాలు నడపొద్దు అంటూ వరంగల్ పోలీసులు తమ అఫీషియల్ ఎక్స్ (X) ఖాతాలో ప్రత్యేక పోస్టును షేర్ చేశారు. తప్పు దిశలో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని, ఇది కేవలం వాహనదారులకే కాకుండా ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.