Warangal

News February 7, 2026

వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.

News February 7, 2026

వరంగల్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో కొత్త వాటి కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పకడ్బందీగా అక్రిడిటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.

News February 7, 2026

కేయూ దూర విద్య అడ్మిషన్ల నోటిఫికేషన్

image

కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో యూజీ, పీజీతో పాటు ఇతర కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్
ప్రతాపరెడ్డి విడుదల చేశారు. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని డైరెక్టర్ సురేన్‌లాల్ తెలిపారు. ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. అలాగే ఈ నెల 17 నుంచి 27 వరకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 8.15 గంటల వరకు జూమ్ వేదికగా ఎన్ఐపీ ఆన్‌లైన్ సదస్సు నిర్వహించనున్నారు.

News February 6, 2026

ఫార్మసీ అధికారుల సమస్యలను పరిష్కరిస్తాం: డీఎంహెచ్‌వో

image

ఫార్మసీ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు అదనపు పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్‌వో డాక్టర్ బి. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఫార్మసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పోస్టుల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి అధికారులకు లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.

News February 6, 2026

ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వద్దు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. ఎన్నికల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోలింగ్ నిర్వహణ అత్యంత ప్రధానమైనదని, అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు.

News February 6, 2026

చిన్న పొరపాటు లేకుండా ఎన్నికలను నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల్లో చిన్న పొరపాటు లేకుండా అధికారులు సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేటలోని జడ్పీ సెకండరీ స్కూల్‌లో పీవోలు, ఏపీవోలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రిని, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.

News February 2, 2026

వరంగల్: ఎంపిక ప్రక్రియపై దిశానిర్దేశం

image

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.సత్య శారదతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News February 2, 2026

బలమైన ప్రజాపక్షపాలన అందించేందుకు సిద్ధం: బీజేపీ

image

BJP ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగింది. గంట రవికుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. మున్సిపాలిటీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలలో కూడా బలమైన ప్రజాపక్ష పాలన అందించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.

News February 2, 2026

వారసత్వ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంపీ డా.కావ్య

image

వరంగల్లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభలో సంస్కృతి శాఖ మంత్రిని వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ కింద చేపట్టిన అభివృద్ధిపై ఎంపీ వివరణ కోరారు. అందుకు ఆ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ తెలిపారు.

News February 1, 2026

హనుమకొండ: మినీ మేడారం జాతరలో 13వేల మందికి చికిత్స

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన మినీ మేడారం జాతరలో 13,242 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు DMHO డా.అప్పయ్య తెలిపారు. హయగ్రీవాచారి మైదానం, ఆత్మకూరు, ఊరుగొండ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ఈ సేవలు అందజేశామన్నారు. మెరుగైన చికిత్స కోసం 19 మందిని పెద్దాసుపత్రికి తరలించామని, 10 మందికి కుక్కకాటు ఇంజక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.