Warangal

News March 17, 2024

వరంగల్: మహిళా ఓటర్లే కీలకం 

image

ఉమ్మడి వరంగల్ పరిధిలోని వరంగల్, మానుకోట లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలే కీలకం కానున్నారు. వరంగల్ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో 18,16,609 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 8,92,676, మహిళలు 9,23,541, ఇతరులు 392 మంది ఉన్నారు. మహబూబాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 15,26,137 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,45,716 మంది పురుషులు, 7,80,316 మంది మహిళలు, 105 మంది ఇతరులున్నారు

News March 17, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దపీట..

image

37 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తూ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పరకాల – ఇనగాల వెంకట్రామి రెడ్డికి (కుడా చైర్మన్), వరంగల్ పశ్చిమ – జంగా రాఘవ రెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్), మహబూబాబాద్ -బెల్లయ్య నాయక్ (గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్), భూపాలపల్లి – ప్రకాష్ రెడ్డి (ట్రేడింగ్&ప్రమోషన్ చైర్మన్)గా నియమించారు.

News March 17, 2024

జనగామ: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

image

రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.  

News March 17, 2024

ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా జంగా

image

కాంగ్రెస్ కోసం పని చేసినా అవకాశాలు దక్కని నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తోంది. జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ & గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2024

వరంగల్ ఎంపీ టికెట్‌పై ఆసక్తి!

image

వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ స్థానాన్ని ఎంతో కీలకంగా భావించి అభ్యర్థుల ప్రకటన కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా ఆరూరి రమేశ్‌కు బీజేపీ నుంచి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News March 17, 2024

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్: కలెక్టర్

image

జాతీయ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, యం.కృష్ణమూర్తి “జాతీయ లోక్ అదాలత్”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు రాజమార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

News March 16, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు హైలెట్స్

image

>HNK: హంటర్ రోడ్లో శిశువు మృతదేహం లభ్యం
>గణపురం: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
>జిల్లాలో కొనసాగిన జాతీయ లోక్ అదాలత్
>జిల్లాలో BRS ఆధ్వర్యంలో నిరసనలు
>HNKలో సందీప్ చేసిన గేయ రచయిత చంద్రబోస్
>పర్వతగిరిలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
>కేసముద్రంలో పర్యటించిన MLA మురళి నాయక్
>WGL: విద్యార్థినిని దారుణంగా కొట్టిన పిఈటి
> నెల్లికుదురు: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

News March 16, 2024

హన్మకొండ: చెత్త కుప్పలో మగ శిశు మృతదేహం లభ్యం

image

హన్మకొండ జిల్లా హంటర్ రోడ్‌లో గల సహకార్ నగర్‌లోని చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో ఒక సంచిలో శిశువు మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో, ఒక కాలు తెగి ఉండటంతో సుబేదారి పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2024

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి?

image

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ టికెట్ కోసం ముగ్గురు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సాంబయ్య, సీనియర్ నాయకులైన సింగాపురం ఇందిరా, జన్ను పరంజ్యోతి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. 2, 3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

News March 16, 2024

పర్వతగిరిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.