Warangal

News October 20, 2024

WGL: రేపటి నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. 6, 8, 10 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటలకు, 7, 9 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటలకు పరీక్షలు ప్రారంభవుతాయన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పకుండా సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు రేపటి నుంచి నిర్వహించాలన్నారు.

News October 20, 2024

వరంగల్ మార్కెట్ రేపు తిరిగి ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News October 20, 2024

చిన్నపిల్లల వ్యాధులపై అప్రమత్తం చేయాలి: ఎంపీ కావ్య

image

శిశువుల్లో అతి ప్రమాదకరమైన వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. మడికొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ పదోవ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే విధంగా సరైన న్యూట్రిషన్ అందించాలని తెలిపారు.

News October 20, 2024

తాడ్వాయి: మేడారంలో భక్తుల సందడి

image

తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవ డానికి ఆదివారం భక్తులు తరలివస్తున్నారు. భక్తులు ముందుగా జంపన్నవాగు వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చీరే సారే, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

News October 20, 2024

WGL: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

image

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

News October 20, 2024

కమలాపూర్: సర్పంచ్ కోసం వినూత్న ప్రచారం

image

ఐదేళ్లు 5 హామీలు అంటూ గెలిచిన తర్వాత తప్పకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీరుస్తానని ఓ సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న ప్రచారానికి తెరలేపారు. HNK జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన ర్యాకం శ్రీనివాస్‌ రాబోయే సర్పంచ్‌ ఎలక్షన్లలో పోటీ చేస్తానని, 5 సంవత్సరాల్లో ఐదు గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ ప్రచారం అవుతోంది.

News October 20, 2024

జనగామ: రైతుల నుంచి పత్తి కొనుగోలు సజావుగా జరగాలి: కలెక్టర్

image

రైతుల నుంచి పత్తి కొనుగోలును సజావుగా చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం ఒక ప్రైవేటు జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోళ్లు చేయాలని సిబ్బందిని సీసీఐ మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు.

News October 20, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> BHPL: ఓవర్ లోడుతో వెళ్తున్న 3 ఇసుక లారీలు సీజ్
> MHBD: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SI
> WGL: తల్లి, కుమారుడు అనుమానాస్పద మృతి
> PLK: మృతుడు శ్రీను సెల్ఫీ వీడియో
> NSPT: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
> MHBD: పిడుగుపాటుతో మహిళా మృతి
> WGL: మట్టేవాడ పరిధిలో గుట్కా సీజ్
> NSPT: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
> MHBD: పిడుగుపాటుతో ఎడ్లు మృతి

News October 19, 2024

రూమ్ సెర్చ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన అంజయ్య

image

ఈ నెల 16 నుంచి 19 వరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో జరిగిన తెలంగాణ స్టేట్ ఫస్ట్ మీట్‌లో మహబూబాబాద్ బీడీ టీంలో పనిచేస్తున్న కె.అంజయ్య రూమ్ సెర్చ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. మహబూబాబాద్ జిల్లాకి గోల్డ్ మెడల్ రావడం పట్ల మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎస్పీలు అంజయ్యకు అభినందనలు తెలిపారు.

News October 19, 2024

వరంగల్: తల్లి, కుమారుడు అనుమానాస్పద మృతి

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధవారపేటలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో తల్లి విజయ (45), కుమారుడు విక్రమ్ (20) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇంట్లో వేర్వేరు గదుల్లో తల్లి, కుమారుడి మృతదేహాలు పడిఉన్నాయి. వీరి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.