India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.

కాంగ్రెస్ కోసం పని చేసినా అవకాశాలు దక్కని నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తోంది. జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ & గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్ పార్లమెంట్‌కు సంబంధించి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఈ స్థానాన్ని ఎంతో కీలకంగా భావించి అభ్యర్థుల ప్రకటన కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా ఆరూరి రమేశ్‌కు బీజేపీ నుంచి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, యం.కృష్ణమూర్తి “జాతీయ లోక్ అదాలత్”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఇరుపక్షాలు రాజమార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

>HNK: హంటర్ రోడ్లో శిశువు మృతదేహం లభ్యం
>గణపురం: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
>జిల్లాలో కొనసాగిన జాతీయ లోక్ అదాలత్
>జిల్లాలో BRS ఆధ్వర్యంలో నిరసనలు
>HNKలో సందీప్ చేసిన గేయ రచయిత చంద్రబోస్
>పర్వతగిరిలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
>కేసముద్రంలో పర్యటించిన MLA మురళి నాయక్
>WGL: విద్యార్థినిని దారుణంగా కొట్టిన పిఈటి
> నెల్లికుదురు: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

హన్మకొండ జిల్లా హంటర్ రోడ్‌లో గల సహకార్ నగర్‌లోని చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో ఒక సంచిలో శిశువు మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో, ఒక కాలు తెగి ఉండటంతో సుబేదారి పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఎవరికి వస్తుందో అని ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ టికెట్ కోసం ముగ్గురు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సాంబయ్య, సీనియర్ నాయకులైన సింగాపురం ఇందిరా, జన్ను పరంజ్యోతి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. 2, 3 రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.
Sorry, no posts matched your criteria.