News April 19, 2024

పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణాలివే!

image

పిల్లల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. ఇవాళ వరల్డ్ లివర్ డే సందర్భంగా ఇందుకు గల కారణాలను వెల్లడించారు. చాక్లెట్లు, క్యాండీలు లాంటి చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్స్ తినడం వల్ల కాలేయంలో కొవ్వు పెరుగుతుందని చెబుతున్నారు. ఫోన్స్ చూస్తూ ఎక్కువసేపు కదలకుండా ఉండటం ఊబకాయానికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచిస్తున్నారు.

Similar News

News September 15, 2024

IPLలో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్.. షాకయ్యా: ధ్రువ్ జురెల్

image

IPLలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కలిసి ఆడిన జో రూట్ టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ చేయడంతో షాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు. ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ENGతో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ‘రూట్ అదేపనిగా నన్ను స్లెడ్జింగ్ చేశారు. అతని మాటలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు’ అని పేర్కొన్నారు.

News September 15, 2024

‘మత్తు వదలరా-2’ చూసి చాలా ఎంజాయ్ చేశాం: మహేశ్ బాబు

image

మత్తు వదలరా-2 మూవీ యూనిట్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ‘సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాం. సింహా, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. వెన్నెల కిశోర్ స్క్రీన్‌పై కనిపించగానే నా కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. సత్యను చూస్తున్నంతసేపూ మేమంతా నవ్వుతూనే ఉన్నాం. మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్’ అని ట్వీట్ చేశారు.

News September 15, 2024

Learning English: Synonyms

image

✒ Amazing: Incredible, Unbelievable
✒ Anger: Enrage, Infuriate, Arouse
✒ Angry: Wrathful, Furious, Enraged
✒ Answer: Reply, Respond, Retort
✒ Ask: Question, Inquire, Query
✒ Awful: Dreadful, Terrible, Abominable
✒ Bad: Depraved, Rotten, Sinful
✒ Beautiful: Gorgeous, Dazzling, Splendid
✒ Begin: Start, Open, Launch, Initiate