News June 25, 2024

కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

image

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిన్న తిహార్ జైలులో ఆయనను ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. రేపు సీబీఐ ట్రయల్ కోర్టులో CMను హాజరుపర్చనుంది. కాగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఇవాళ బెయిల్ విషయమై హైకోర్టులో ఢిల్లీ సీఎంకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

Similar News

News January 8, 2026

బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

image

బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్‌ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.

News January 8, 2026

ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

image

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్‌ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

News January 8, 2026

ప్రతి విషయానికి బాధ పడుతున్నారా?

image

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖
విచారించకూడని విషయాల గురించి బాధపడటం సమయాన్ని వృథా చేసుకోవడమే! నిజమైన జ్ఞానులు పోయిన వారి గురించి కానీ, ఉన్న వారి గురించి కానీ, లేదా జరిగిపోయిన విషయాల గురించి కానీ అస్సలు శోకించరు. అనవసరమైన ఆలోచనలతో మెదడును సందిగ్ధంలో పడేయకుండా ఏది శాశ్వతమో తెలుసుకుని స్థితప్రజ్ఞతతో ఉండటమే అసలైన పరిష్కారం. <<-se>>#MSBP<<>>