News June 25, 2024
కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిన్న తిహార్ జైలులో ఆయనను ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. రేపు సీబీఐ ట్రయల్ కోర్టులో CMను హాజరుపర్చనుంది. కాగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఇవాళ బెయిల్ విషయమై హైకోర్టులో ఢిల్లీ సీఎంకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.
Similar News
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?

UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
News February 13, 2025
‘తండేల్’ కలెక్షన్ల సునామీ

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో మూవీ యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించనుంది.
News February 13, 2025
అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.