News June 7, 2024
కవితపై సీబీఐ ఛార్జ్‌షీట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో BRS MLC కవితపై రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇక సీబీఐ కేసులో కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News November 16, 2025
రాజ్యసభలో పెరగనున్న NDA బలం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాజ్యసభలో NDA బలం పెరగనుంది. రాష్ట్రంలో ఐదింటికి వచ్చే ఏడాది, మిగతా 5 స్థానాలకు 2028లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. వీటన్నింటినీ NDA చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రతిపక్ష RJD తన 3 సీట్లను కోల్పోనుంది. ఒక సీటును నిలబెట్టుకోవాలంటే కనీసం 42 మంది MLAలు ఉండాలి. కానీ RJD గెలిచింది 25 సీట్లే. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది ఎంపీలు ఉన్నారు.
News November 16, 2025
‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.
News November 16, 2025
రేపే కార్తీక మాస చివరి సోమవారం.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం

రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం. గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. రేపు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>>.


