News January 31, 2025
విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. నెల రోజుల పాటు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు తనకు అనుమతినివ్వాలని విజయసాయి కోర్టును కోరగా 15 రోజులపాటు వెళ్లేందుకు న్యాయమూర్తి పర్మిషన్ ఇచ్చారు. వచ్చే నెల 10 నుంచి మార్చి 10 మధ్యలో 15 రోజుల్లో విదేశాలకు వెళ్లి రావొచ్చని సూచించారు.
Similar News
News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.
News February 13, 2025
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

TG: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టినట్లు కొన్ని కాలేజీలపై ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను https://tgbie.cgg.gov.in/ <
News February 13, 2025
జూన్‌లో ‘స్థానిక’ ఎన్నికలు?

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.