News January 3, 2025
CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు: సుప్రీం
రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై FIR నమోదుకు CBIకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి CBI దర్యాప్తును AP హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా HC తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్‌కు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని పేర్కొంది.
Similar News
News February 5, 2025
రేపు సీఎల్పీ సమావేశం
TG: రేపు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. మ.3 గంటలకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.