News August 22, 2024
సీబీఐ విచారించింది వీరినే..(2/2)
ఘటనకు ముందు బాధితురాలితో భోజనం చేసిన నలుగురు స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్, ప్రధాన నిందితుడు పడుకున్న బర్రాక్ ఏఎస్సై, అతని స్నేహితుడు, బాధితురాలి నలుగురు అత్యంత సన్నిహితులు, పోస్టుమార్టం నిర్వహించిన ఐదుగురు వైద్యులు, అస్పత్రికి చెందిన మరో ఇద్దర్ని CBI విచారించింది. వీరితోపాటు 49 మంది గ్రౌండ్ స్టాఫ్, సెమినార్ హాల్ రెనోవేషన్ చేసిన కార్మికులను విచారించినట్లు కోర్టుకు సీబీఐ నివేదించింది.
Similar News
News September 13, 2024
దేవర ‘ఆయుధ పూజ’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
‘దేవర’ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ఆయుధ పూజ’ సాంగ్ వచ్చే వారం విడుదల కానుంది. ఈ విషయాన్ని లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి వెల్లడించారు. కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
News September 13, 2024
జగన్ నామజపం మాని ప్రజల బాగోగులపై దృష్టిపెట్టండి చంద్రబాబూ: వైసీపీ చీఫ్
AP: గోబెల్స్‌కు తమ్ముడులాంటి వ్యక్తి చంద్రబాబు అని, అబద్ధాన్ని కూడా అమ్మగలిగే టాలెంట్ ఆయన సొంతమని YCP చీఫ్ జగన్ విమర్శించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో ఈ సర్కారుకు తెలియదన్నారు. పిఠాపురంలో పర్యటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఇప్పటికీ ఎక్కడ ఏం జరిగినా జగనే కారణమని CBN అంటున్నారు. ఆయన జగన్ నామజపం మాని ప్రజలకు మంచి చేయడంపై దృష్టిపెట్టాలి’ అని సూచించారు.
News September 13, 2024
సెబీ చీఫ్‌పై లోక్‌పాల్‌కు మహువా మొయిత్రా ఫిర్యాదు
సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశానని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ముందు ప్రాథమిక, తర్వాత పూర్తిస్థాయి FIR ఎంక్వైరీ జరిగేలా ఈడీ లేదా సీబీఐకి దానిని పంపించాలని అంబుడ్స్‌మన్‌ను కోరినట్టు తెలిపారు. ఆన్‌లైన్ కంప్లైంట్, ఫిజికల్ కాపీ స్క్రీన్‌షాట్లను Xలో పోస్ట్ చేశారు. సెబీ వ్యవహారంలో జోక్యమున్న ప్రతి సంస్థకు సమన్లు ఇవ్వాలని, ప్రతి లింకును ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేశారు.