News December 28, 2024
ED ఆఫీసుపై CBI రైడ్.. అది కూడా లంచం కేసు

లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్యక్తి నుంచి ₹55 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 లక్షలతోపాటు విశాల్ ఆఫీసులో మరో ₹56 లక్షల నగదును CBI సీజ్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.
Similar News
News January 6, 2026
ప్రముఖ నటుడు కన్నుమూత

టాలీవుడ్ నటుడు సురేశ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. 3 దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో పని చేసిన ఆయన.. మల్టీనేషనల్ బ్యాంకుల్లో అత్యున్నత పదవుల్లో పని చేశారు. నటనపై ఆసక్తితో చిత్ర రంగంలోకి ప్రవేశించిన సురేశ్ కుమార్.. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో నటించి మెప్పించారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహా నటి, గోల్కొండ హైస్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి పలు సినిమాల్లో నటించారు.
News January 6, 2026
₹19,391CR పెట్టుబడులు…11,753 ఉద్యోగాలు

AP: CM CBN అధ్యక్షతన జరిగిన SIPB సమావేశం 14 సంస్థలకు సంబంధించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 11,753 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాగా పాలసీలను అందరికీ సమానంగా అమలుచేయాలని CBN సమావేశంలో స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఉద్యాన పంటల ఉత్పత్తులు భారీగా వస్తాయని, అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని చెప్పారు. స్పేస్ సిటీ కోసం 5వేల ఎకరాలు అవసరమన్నారు.
News January 6, 2026
కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది: CJI

కాలుష్య నివారణలో ధనవంతులూ త్యాగాలు చేయాలని CJI సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘కార్లు స్టేటస్ సింబల్‌గా మారాయి. సైకిళ్లు మానేసి కార్లు కొనడానికి డబ్బు ఆదా చేస్తున్నారు. ధనవంతులు ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్యం తగ్గుతుంది. హై ఎండ్ కార్లకు బదులు EVలను వాడొచ్చు’ అని సూచించారు. ఢిల్లీ కాలుష్య నివారణలో AQMC విఫలమవుతోందన్నారు. టోల్ ప్లాజాల మూసివేతకు 2నెలల సమయం కావాలని కోరడాన్ని తప్పుబట్టారు.


