News March 23, 2024
మహువా మొయిత్రా ఇళ్లు, కార్యాలయాలపై CBI దాడులు
డబ్బు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిన కేసులో టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తోంది. కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆమె నివాసాలు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఆమెపై FIR నమోదు చేసి ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 18, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫీచర్
టీనేజ్ యూజర్ల ప్రైవసీ కోసం ఇన్‌స్టాలో ‘టీన్ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. దీనితో 13-17ఏళ్ల వయసున్న యూజర్ల అకౌంట్లు ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌లోకి వెళ్తాయి. వారి కంటెంట్ ఫాలోవర్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. వీరు యాక్సెప్ట్ చేస్తేనే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతారు. పేరెంట్‌ను యాడ్ చేసి వారి అనుమతితో ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. త్వరలో US, UK, AUS, CANలో, 2025 JAN నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది.
News September 18, 2024
నేడు NPS వాత్సల్య పథకం ప్రారంభం.. ప్రయోజనాలివే
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల పేరుతో పేరెంట్స్/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండాక ఇది NPS అకౌంట్‌గా మారుతుంది. ఏడాదికి రూ.1,000 నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు. ఏటా వడ్డీ జమవుతుంది. ఇందులో పెట్టుబడితో సెక్షన్ 8CCD(1B) కింద రూ.50వేల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక NPS నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు.
News September 18, 2024
ఏపీలో టీచర్‌గా చేసిన ఢిల్లీ కొత్త సీఎం
ఢిల్లీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆతిశీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పాలిటిక్స్‌లోకి రాకముందు ఆమె టీచర్‌గా పనిచేశారు. ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు సలహాదారుగానూ వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.