News December 7, 2024
కంటైనర్‌లో డ్రగ్స్ లేవన్న సీబీఐ.. నోరు మెదపని కూటమి నేతలు

AP: విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి 25K టన్నుల డ్రగ్స్ వచ్చాయని, దీని వెనుక YCP నేతలు ఉన్నారని కూటమి నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ కేసు అప్పట్లో సంచలనమైంది. YS జగన్ మరో పాబ్లో ఎస్కోబార్ అని CBN విమర్శించారు. విశాఖను డ్రగ్ క్యాపిటల్‌గా మార్చారని పవన్, పురందీశ్వరి ఆరోపించారు. అయితే ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని CBI తాజాగా <<14811211>>ప్రకటించింది<<>>. దీనిపై కూటమి నేతలెవరూ స్పందించలేదు.
Similar News
News December 11, 2025
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 700+ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 250+ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇండిపెండెంట్లు 150+ స్థానాల్లో గెలవగా.. BJP బలపరిచిన అభ్యర్థులు 50+ స్థానాల్లో విజయం సాధించారు.
News December 11, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం బంగారం <<18528737>>ధరలు<<>> కాస్త తగ్గగా.. గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.440 పెరిగి రూ.1,30,750కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.400 ఎగబాకి రూ.1,19,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,09,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 11, 2025
ఈ నూనెలతో మేకప్ తొలగిద్దాం..

మేకప్ వేసుకోవడంతో పాటు దాన్ని తియ్యడంలో కూడా జాగ్రత్తలు పాటిస్తేనే చర్మ ఆరోగ్యం బావుంటుందంటున్నారు నిపుణులు. వాటర్ ఫ్రూఫ్ మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల సులువుగా శుభ్ర పడటంతో పాటు చర్మం కూడా తాజాగా ఉంటుంది. కీరదోస రసంలో చెంచా గులాబీ నూనె కలిపి ముఖానికి రాసుకున్నా మేకప్ పోతుంది. ఇది సహజ క్లెన్సర్ గానూ పని చేస్తుంది. తేనె, బాదం నూనె కలిపి మేకప్ తీసినా చర్మం పాడవకుండా ఉంటుంది.


