News December 7, 2024

కంటైనర్‌లో డ్రగ్స్ లేవన్న సీబీఐ.. నోరు మెదపని కూటమి నేతలు

image

AP: విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి 25K టన్నుల డ్రగ్స్ వచ్చాయని, దీని వెనుక YCP నేతలు ఉన్నారని కూటమి నేతలు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ కేసు అప్పట్లో సంచలనమైంది. YS జగన్ మరో పాబ్లో ఎస్కోబార్ అని CBN విమర్శించారు. విశాఖను డ్రగ్ క్యాపిటల్‌గా మార్చారని పవన్, పురందీశ్వరి ఆరోపించారు. అయితే ఆ కంటైనర్‌లో డ్రగ్స్ లేవని CBI తాజాగా <<14811211>>ప్రకటించింది<<>>. దీనిపై కూటమి నేతలెవరూ స్పందించలేదు.

Similar News

News April 19, 2026

పాక్‌లో భారీ భద్రత.. రెండో విడత చర్చల కోసమేనా?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా క్లారిటీ రాకపోయినా పాకిస్థాన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇస్లామాబాద్, రావల్పిండీ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. రావల్పిండీలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. పార్కులు, బ్యాంకులు, షాప్స్, రెస్టారెంట్లను మూయించింది. 600 చెక్ పాయింట్లలో 10వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది.

News April 19, 2026

నగరడోన@45.4 డిగ్రీలు.. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

ఇవాళ APలో ఎండలు బెంబేలెత్తించాయి. కర్నూలు(D) నగరడోనలో 45.4, కడప(D) ఖాజీపేటలో 44.5 డిగ్రీలు, చాలా చోట్ల 40 డిగ్రీల పై ఉష్ణోగ్రతలు నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

News April 19, 2026

నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

image

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.